మోటో, షియోమీ ఫోన్లకు 'మార్ష్‌మాలో'

Xiaomi And Moto Phones To Get Marshmallow

04:29 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Xiaomi And Moto Phones To Get Marshmallow

లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో అప్ డేట్ ను తమ వినియోగదారులకు అందించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కో కంపెనీ ఆయా మోడల్స్‌కు ఆండ్రాయిడ్ 6.0ను విడుదల చేస్తూ వస్తున్నాయి. తాజాగా మోటోరోలా, షియోమీ కూడా తన స్మార్ట్‌ఫోన్లకు ఈ కొత్త అప్‌డేట్‌ను అందించనున్నాయి. షియోమీ ఎంఐ 3, ఎంఐ 4, ఎంఐ నోట్‌లు అతి త్వరలోనే ఆండ్రాయిడ్ మార్ష్‌మాలోను పొందనున్నాయి. ఈ వెర్షన్‌తో తయారవుతున్న 'ఎంఐయూఐ 7' ఆండ్రాయిడ్ రామ్ వినియోగదారులకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చివరి దశలో ఉందని షియోమీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఇక మోటోరోలా కూడా ఇదే బాటలో పయనిస్తోంది. మోటో ఎక్స్ స్టైల్‌, మోటో ఎక్స్ ప్లే, మోటో ఎక్స్ (జెన్ 2) ఫోన్లకు ఇప్పటికే మార్ష్‌మాలో అప్‌డేట్‌ను అందించగా తాజాగా ఇప్పుడు 'మోటో జి (జెన్ 3)' ఫోన్‌కు కూడా నూతన ఓఎస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలైలో మోటో జి (జెన్ 3) విడుదలవగా ఇందులో డిఫాల్ట్‌గా ఆండ్రాయిడ్ 5.1ను అందించారు. కాగా ప్రస్తుతం ఆండ్రాయిడ్ 6.0ను దీనిపై అప్‌గ్రేడ్ చేస్తున్నారు. త్వరలోనే ఇతర సపోర్టెడ్ ఫోన్లకు కూడా ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో అప్‌డేట్‌ను అందిస్తామని మోటోరోలా ప్రతినిధులు చెబుతున్నారు.

English summary