ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి షియోమి

Xiaomi Enters Into Film Making

04:22 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Xiaomi Enters Into Film Making

చైనా యాపిల్ గా పేరు గాంచిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ షియోమీ కొత్త రంగంలోకి అడుగుపెట్ట బోతోంది. సినిమా నిర్మాణ రంగంలో ప్రవేశించేందుకు షియోమి రంగం సిద్ధం చేసుకుంటోంది. షియోమీ, మీడియా గ్రూప్‌ హువాయి బ్రదర్స్‌ స్టార్‌ సంయుక్తంగా ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ ప్రారంభిస్తున్నాయి. షియోమీ ఈ మేరకు ప్రస్తుతం ప్రముఖ చైనా సినీ డైరెక్టర్లతో మంచి స్క్రిప్టు కోసం చర్చలు జరుపుతోంది. చైనాలో బాక్సాఫీస్‌ రికార్డులన్నీ తుడిచిపెడుతూ గత ఏడాది 6.1 బిలియన్‌ డాలర్లు వసూలు అయ్యాయి. దీంతో పలు డిజిటల్‌ కంపెనీలు సినీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నాయి. తాజాగా వాటి సరసన షియోమీ కూడా చేరింది.

English summary

Popular mobile manufacturing company Xiaomi Enters into film making.Last week Xiaomi company announced it had shipped more than 70 million handsets in 2015.One of the official said that Xiaomi company was discussing with some of the film directors for its future process