ఇక నుండి జియోమి ఫోన్లకు ప్రోటెక్షన్

Xiaomi India comes with Mi Protect plans starting at Rs 275

02:33 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Xiaomi India comes with  Mi Protect plans starting at Rs 275

ప్రపంచలోనే అత్యంత చవకైనా ఫోన్లను అందిస్తూ తక్కువ కాలంలోనే అగ్రగామి మొబైల్ ఉత్పత్తిదారుగా మారిన జియోమి ఇప్పుడు ఇండియాలో తన మార్కెట్ను పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తన మొబైల్ కొనుగోలుదారులకు ఇన్సూరెన్స్ విధానాన్ని మంచిరేట్లకే అందిస్తోంది. జియోమి తన సంస్థకు చెందిన మొబైల్ ఫోన్లకు 275రూపాయల ప్రారంభ ధరతో కొత్తగా ఇన్సూరెన్స్ పాన్లను ప్రకటించింది. మరిన్ని ఆకర్షణీయమైన పాన్లతో జియోమి భారత్ లోని వినియోగదారులను పెంచుకునేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఈ ప్రణాళికలోని వినూత్న అంశం ఏమిటంటే 24గంటల నిరంతర కాల్ సెంటర్. అంటే మీ మొబైల్ కు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా లేదా మొబైల్ కు ఏదైనా డామేజీ జరిగితే దానికి సంబంధించిన వివరాలను తెలియజేయడానికి కాల్ సెంటర్ ఉపకరిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక్క కాల్ చేసి దొంగతనానికి గురైన మీ ఫోన్ యొక్క సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. మీ సిమ్ కనుక దుర్వినియోగమైతే భీమా పథకం ద్వారా 3000రూపాయల వరకు చెల్లిస్తారు. మీరు కొత్తగా జియోమికి చెందిన ఫోన్లను కొనుగోలు చేసిన తక్షణమే ఈ పథకం అమలులోకి వస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రొటెక్ట్ ప్లాన్ అవసరం లేదనుకుంటే కొనుగోలు చేసిన 30రోజులలో మీరు కాల్ సెంటర్ కు కాల్ చేసి రద్దుచేసుకోవాలి.

English summary

Xiaomi India comes with Mi Protect plans starting at Rs 275.Xiaomi introduces Mi planes starts with Rs275 up to Rs499