షియోమీ నుంచి కొత్త పవర్ బ్యాంక్..

Xiaomi Launches Mi Power Bank Pro

04:59 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Xiaomi Launches Mi Power Bank Pro

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియోమీ కొత్త పవర్ బ్యాంక్ ను తీసుకొచ్చింది. 10000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన ఎంఐ పవర్ బ్యాంక్ ప్రోను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. దీంతోపాటు ఎంఐ బాక్స్ 3 పేరిట ఓ మీడియా ప్లేయర్‌ను కూడా విడుదల చేసింది. త్వరలోనే ఈ రెండు డివైస్‌లు ప్రపంచ వ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కాగా పవర్ బ్యాంక్ మాత్రం రూ.1,500 ధరకు భారత్‌లోని యూజర్లకు లభ్యం కానుంది. ఎంఐ పవర్ బ్యాంక్ ప్రోలో యూఎస్‌బీ టైప్-ఎ కనెక్టర్, మైక్రో యూఎస్‌బీ టైప్-సి అడాప్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టు-వే ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఈ పవర్ బ్యాంక్ పనిచేస్తుంది. 12V, 9V, 5V ఔట్‌పుట్ పవర్‌ను దీని ద్వారా పొందవచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్లే కాకుండా బ్లూటూత్ హెడ్‌ఫోన్స్, ఫిట్‌నెస్ బ్యాండ్స్ వంటి ఇతర యాక్ససరీలను కూడా చార్జింగ్ చేసుకునే విధంగా ఎంఐ పవర్ బ్యాంక్ ప్రోను తీర్చిదిద్దారు. దీంతో ఆయా డివైస్‌లను వేగంగా చార్జింగ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎంఐ బాక్స్ 3 భారత్‌లోని వినియోగదారులకు రూ.4,100లకు లభ్యం కానుండగా దీంట్లో వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1 వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Chinese mobile company Xiaomi launched a new power bank named Mi Power Bank Pro.The price of this Power bank will be 1500 rupees and it comes with the key features like 10,000 mAh battery,Slimmer Build, Faster Charging,Aluminium Body