షియోమీ రెడ్‌మీ నోట్ ప్రైమ్ విడుదల

Xiaomi Launches Red Mi Note Prime

04:50 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Xiaomi Launches Red Mi Note Prime

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియోమీ తన కొత్త మొబైల్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టులో చైనాలో షియోమీ రెడ్‌మీ నోట్ ప్రైమ్‌ ను విడుదల చేసిన షియోమీ తాజాగా భారత్ లోనూ ఈ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.8,499. అమెజాన్ వెబ్ సైట్ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. 3100 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.

5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లేతో 4జీని సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్యాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ(32 జీబీ స్టోరేజ్ కు పెంచుకోవచ్చు), 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్ మీ 2 ప్రైమ్ తర్వాత భారత్ లో తయారైన షియోమీ మొబైల్ ఫోన్ ఇదే. దీనిని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీ సెజ్ లో తయారు చేస్తున్నారు. లెనోవా కె3 నోట్ కు గట్టి పోటీదారుగా రెడ్ మీ నోట్ ప్రైమ్ ను షియోమీ విడుదల చేసింది.

English summary

Chineese mobile company Xiaomi launches a smart phone called red mi note prime in india today. This was the phone manufractured in India