షియోమీ నుంచి ఎంఐ 5 స్మార్ట్‌ఫోన్

Xiaomi Mi 5 Smartphone

06:41 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Xiaomi Mi 5 Smartphone

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియోమీ తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. తన సక్సెస్ ఫుల్ మొబైల్ ఫోన్ ఎంఐ4 సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ఎంఐ5 స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. త్వరలోనే ఇది భారత్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వెర్షన్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21 వేలు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.24 వేలు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ.28 వేలు.

షియోమీ ఎంఐ 5 ఫీచర్లు ఇవే..

5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 జీపీయూ, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 4 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, క్వాల్‌కామ్ క్విక్ చార్జ్ 3.0, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ

English summary

Chineese Mobile Company Xiaomi Launched a New Smart phone called MI 5.in China and within few months this smartphone will be available in India.This smartphone comes with the key features like 5.15-inch display, 4-Ultrapixel Front camera,16-megapixel rear camera, 3GB RAM,32GB Internal Storage,3000mAh Battery.