షియోమీ ఎంఐ 5లో విండోస్ 10 వేరియంట్

Xiaomi Mi 5 Windows10 Mobile Variant

10:40 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Xiaomi Mi 5 Windows10 Mobile Variant

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియోమీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. తన సరికొత్త మోడల్ ఎంఐ 5ను విండోస్ 10 మొబైల్ వేరియెంట్‌లో విడుదల చేయనుంది. మార్చి మొదటి వారంలో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఉన్న హార్డ్‌వేర్ ఫీచర్లనే విండోస్ 10 మొబైల్ వేరియెంట్‌లోనూ అందించనుంది. కాకపోతే కొత్తగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌ను దీంట్లో అమర్చ నుంది. దీంతోపాటు డ్యుయల్ సిమ్, ఎన్‌ఎఫ్‌సీ, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వంటి అదనపు ఫీచర్లను ఇందులో అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నిర్ణయించిన ధరకే దీన్ని కూడా విక్రయించనుందని సమాచారం.

English summary

Popular Chineese mobile company Xiaomi to launch its MI5 smartphone with windows variant along with android variant.