షియోమీ నుంచి అల్ట్రా హెచ్‌డీ టీవీ

Xiaomi Mi TV 3 Launched

12:33 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Xiaomi Mi TV 3 Launched

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తుల తయారీ సంస్థ షియోమీ ఎంఐ టీవీ 3 పేరిట సరికొత్త స్మార్ట్ టీవీని రిలీజ్ చేసింది. 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీని తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.1.02 లక్షలు. ఈ టీవీ త్వరలోనే భారత మార్కెట్‌లోనూ లభ్యం కానుంది. ఎంఐ టీవీ 70 అంగుళాల హెచ్ డీ తెరను కలిగి ఉంది. 3840 X 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, 1.4 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, మాలి 760 ఎంపీ4 జీపీయూ, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మెటలిక్ బాడీ ఫినిషింగ్, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, హెచ్‌డీఎంఐ, మైక్రో యూఎస్‌బీ, యూఎస్‌బీ, ఈథర్‌నెట్ పోర్ట్ కనెక్టివిటీ, 2.5 ఇంచ్ ఫుల్ రేంజ్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ డీటీఎస్ వర్చువల్ సరౌండ్ సౌండ్ అండ్ బేస్ బూస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

English summary

Xiaomi Mi TV 3 Launched