'ఎంఐ 5' ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Xiaomi Mi5 First Look

04:18 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Xiaomi Mi5 First Look

చైనా యాపిల్ గా పేరొందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ. ఇప్పుడు తన ఫ్లాగ్ షిప్ ఫోన్ 'ఎంఐ5' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఎంఐ 5 ఫస్ట్ లుక్ ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఫుల్లీ మెటల్ ఫ్రేమ్, బేజెల్ లెస్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది షియోమీ సంస్థ.

3డీ టచ్ ప్రెజర్ సెన్సిటివ్ టెక్నాలజీని ఎంఐ5లో వినియోగించనున్నారు. ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ ఉంటుందని చెపుతున్నా స్నాప్ డ్రాగన్ 820 ని వాడొచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. మరో రూమర్ కూడా వినిపిస్తోంది. స్నాప్ డ్రాగన్ అప్ డేట్ ఆలస్యమవుతున్నందున.. మీడియాటెక్ డెకా కోర్ టెలియో ఎక్స్ 20 ప్రాసెసర్ ను వినియోగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే కంపెనీ వీటికి సంబంధించి ఎటుంటి ప్రకటనా చేయలేదు.

ఇక మిగతా ఫీచర్ల విషయానికి వస్తే ఎంఐ 5లో 4 జీబీ ర్యామ్, అడ్రినో 530 జీపీయూ, 5.3 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440X2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 554 పిక్సల్ డెన్సిటీ, 16 లేదా 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 3030 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి. ధర వివరాలను షియోమీ ఇంకా వెల్లడించకపోయినా ఈ ఫోన్ వెయిట్ చేయానికి అర్హమైనదని సంస్థ సీఈవో లే జెన్ పేర్కొంటున్నారు.

English summary

Chineese Mobile Company Xiaomi released the look of the new smartphone MI5. The phone comes with the features like fully metal body,octa core qualcom snap dragon processor,3D touch pressure senstive technology,4GB Ram,16 megapixel camera etc