12న భారత్ లోకి షియోమి రెడ్‌మి 3

Xiaomi Redmi 3

05:39 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Xiaomi Redmi 3

చైనా యాపిల్ గా పేరుగాంచిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ షియోమి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ నెల 12న రెడ్ మీ సిరీస్ లో సరికొత్త మోడల్‌ రెడ్‌మి 3ని విడుదల చేయనుంది. ఎంఐ 5 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, వివరాలు వెల్లడించిన వెంటనే రెడ్‌మి 3 విడుదలకు కూడా సూచన ఇచ్చేసింది. రెడ్‌మి 3 ఫోన్‌పై కంపెనీ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ వైబోలో టీజర్‌ విడుదల చేసింది. రెడ్‌మి 3కి 5 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 13 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా, 1.5 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌, 4జీ సదుపాయం ఉండొచ్చని అంచనా. వచ్చే మంగళవారం ఫోన్‌ అధికారికంగా విడుదలైన తర్వాతే ఫీచర్లు, ధర అన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

English summary

Xiaomi has now confirmed that the Redmi 3 smartphone will be launch in India Soon