షియోమీ రెడ్‌మీ నోట్ 3 విడుదల..

Xiaomi Redmi Note 3 Smartphone

12:42 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Xiaomi Redmi Note 3 Smartphone

చైనా యాపిల్ గా పేరుగాంచిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 3 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 2జీబీ, 3 జీబీ ర్యామ్ వేరియంట్లలోనూ.. 16 జీబీ, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లలో లభించనుంది. 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999. బుధవారం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ జరగనుంది.

రెడ్‌మీ నోట్ 3 ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హెగ్జాకోర్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలిపాప్, డ్యుయల్ 4జీ సిమ్స్, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

English summary

Chinese mobile company Xiaomi launched a new smartphone calle Xiaomi Red Mi Note 3 in India.This smartphone comes with the key features like 5.5 inches display,2GB RAM,16 GB Internal Storage,16 Mega Pixel Rear Camera,5 Mega Pixel Front Camera