జోలో నుంచి  8ఎక్స్‌-1000ఐ

Xolo 8X-1000i Smart Phone Launched

04:26 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Xolo 8X-1000i Smart Phone Launched

ప్రముఖ దేశీయ మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థ జోలో మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 8ఎక్స్‌-1000ఐ పేరిట రిలీజ్ చేసిన ఈ ఫోన్‌ ధరను రూ.6,999గా నిర్ణయించింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్ స్నాప్‌డీల్‌ ద్వారా దీనిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ హైవ్ యూఐ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇందులో 5 అంగుళాల హెచ్ డీ తాకే తెర, 720*1280 పిక్సల్ రిజల్యూషన్, ఐపీఎస్ డిస్ ప్లే, 294 పిక్సల్ డెన్సిటీ, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 జీబీ రామ్‌, 1.4 ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ ప్రాసెసర్‌, 16 జీబీ ఇన్‌ బిల్ట్‌ మెమొరీ, ఎస్డీ కార్డ్ తో 32 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 2 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, 3జీ, వైఫై, బ్లూటూత్, 1920 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

Xolo 8X-1000i Smart Phone Launched