జోలో నుంచి వన్ హెచ్‌డీ స్మార్ట్ ఫోన్

Xolo One HD Smart Phone Launched

04:53 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Xolo One HD Smart Phone Launched

దేశీయ మొబైల్ తయారీ సంస్థ జోలో వన్ హెచ్‌డీ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,777. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ సైట్ ద్వారా వినియోగదారులకు లభించనుంది. అయితే ఈ ఫోన్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఇందులో 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ వైట్ కలర్ లో మాత్రమే లభ్యం కానుంది.

English summary