కవలలకు జన్మనిచ్చిన యాహూ సీఈవో

Yahoo CEO gives birth to twin girls

05:07 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Yahoo CEO gives birth to twin girls

యాహూ సీఈవో మరిస్సా మేయర్ మాతృత్వపు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గురువారం ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా టుంబ్లర్ లో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో పాటు, తనకు సహకరించినవారికి ధన్యవాదాలు అంటూ మరిస్సా ఈ సందర్భంగా ఆమె ట్విట్ చేశారు. మరోవైపు మరిస్సా భర్త బోగ్ 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్విట్ చేయగా, కుటుంబమంతా థ్రిల్లింగ్ లో మునిగితేలుతోంది.

కాగా మరిస్సా మేయర్ జూలై 2012 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా యాహూలో చేరిన విషయం తెలిసిందే. ఫైనాన్షియర్ బోగ్ ను వివాహం చేసుకున్న ఆమె 2012లో తొలిసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సందర్భంగా 16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె కేవలం నాలుగు వారాలకే ఉద్యోగానికి వెళ్లిపోయారు. ఈసారి కూడా మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నిటీ సెలవు తీసుకున్నారు.

English summary

Yahoo CEO Marissa Mayer gave birth to twin girls Thursday.This is the second time that the 40-year-old Mayer has given birth since Yahoo hired her as CEO in July 2012. She and her husband, Zachary Bogue, have a 3-year-old son, Macallister.