పేరు మార్చేసుకున్న యాహూ

Yahoo changed its name

10:59 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Yahoo changed its name

పేరు మార్పు అనేది మనుషులకే కాదు ఈ మధ్య సంస్థల విలీనం సమయంలో కూడా జరిగే తంతే, ఇప్పడు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఇన్ కార్పొరేషన్ తన పేరు మార్చుకుంది. ఆల్టబా ఇన్ కార్పొరేషన్ అన్న కొత్త పేరు పెట్టుకున్నట్లుప్రకటించింది. ఇటీవలే దాదాపు రూ.32వేల కోట్లు విలువైన డీల్ కు యాహూను వెరిజోన్ కొనుగోలు చేసింది. అయితే యాహూలో రెండు సార్లు భారీ సమాచార చౌర్యం జరిగిందన్న వార్త బయటకు రావడంతో ఈ డీల్ రద్దు చేస్తారని భావించారు. దీనిపై వెరిజోన్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ తాము యాహూను బలోపేతం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమాచార చౌర్యంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ డీల్ అమల్లోకి రాగానే ఇప్పటి సీఈవో మరిస్సా మేయర్ రాజీనామా చేస్తారని యాహూ తెలిపింది. ప్రస్తుతం ఉన్న బోర్డులో ఐదుగురు డైరెక్టర్లు కూడా రాజీనామా చేయనున్నారు. మిగిలిన వారు ఆల్టబాలో కొనసాగుతారు. ఎరిక్ బ్రాండెట్ ను కొత్తబోర్డు ఛైర్మన్ గా నియమించారు. మరి యాహూ కొత్తగా ఆల్టబా అవతారం ఎత్తి ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి

ఇది కూడా చూడనాడే : కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

ఇది కూడా చూడనాడే : గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

ఇది కూడా చూడనాడే : దేవుడా మగాళ్ల నుంచి నువ్వే కాపాడాలి ... షాకింగ్ వీడియో

English summary

Not only people but also few organizations are also changing there names recently Yahoo changed its name as Albert in Corporation.