యాహూలో 10 శాతం సిబ్బంది కోత 

Yahoo To Dismiss 10 percent Of Its Employees

11:55 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Yahoo To Dismiss 10 percent Of Its Employees

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం యాహూ కాస్ట్ కటింగ్ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 10 శాతం కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించే ఏర్పాట్లలో యాహూ ఉన్నట్లు సమాచారం. దీంతో వెయ్యిమందికి పైగా సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇటీవల యాహూ వాటాదారుల నుంచి ఎదురైన ఒత్తిళ్ల వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని అన్ని విభాగాలపై ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా మీడియా బిజినెస్‌, యూరోపియన్‌ ఆపరేషన్స్‌ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. జనవరి చివరి నుంచే తొలగింపుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాహూ సీఈవో మరిస్సా మేయర్‌, ఆమె బృందాన్ని కూడా పదవుల నుంచి తప్పించాలని యాహూ వాటాదారైన స్టార్‌బోర్డ్‌ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌కు లేఖ రాసింది. అయితే యాహూ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

English summary

Yahoo Company is working on a plan to cut its workforce by at least 10 percent and it could start the process as early as this month