యాహూలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం!?

Yahoo To Dismiss 16000 Employees

11:55 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Yahoo To Dismiss 16000 Employees

తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ‘యాహూ’ షేర్‌ ధర 1.2శాతం పడిపోయి 29.14డాలర్‌గా ట్రేడ్‌ అవుతోన్న నేపధ్యంలో ఆ సంస్థలో పనిచేసే దాదాపు 16వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నలు వార్తలు గుప్పుమంటున్నాయి. యాహూ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మారిస్సా మేయర్‌ ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు పనిలో ఉన్నారని అంటున్నారు. ఉద్యోగులను తొలగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లోని తమ వ్యాపారా యూనిట్లను కూడా మూసివేయనుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ లో కథనం వచ్చింది. యాహూ కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల అనంతరం కంపెనీ తన నిర్ణయాన్ని ప్రకటించనుందట. అయితే.. ఏ ప్రాంతంలోని కంపెనీలను యాహూ మూసివేయాలనుకుంటుందో మాత్రం ఇంతవరకూ స్పష్టత లేదు. దీనిపై ఇప్పటి వరకు కంపెనీ అధికార ప్రతినిధులు ఎవరూ స్పందించలేదు.

అర్జెంటీనా, మెక్సికోలో ఉన్న తన కార్యాలయాలను మూసివేయనున్నట్లు యాహూ గత వారమే ప్రకటించింది. అయితే ఎంతమంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందనే అంశంపై స్పష్టతలేదు. అంతర్జాల ఆధారిత వ్యాపారాన్ని విస్తృతం చేయడంలో యాహూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సెర్చ్‌, ప్రకటనలు, వార్తలు, క్రీడా వెబ్‌సైట్‌లు, ఈ-మెయిల్‌ సర్వీస్‌ల విభాగంలో గూగుల్‌ ఆల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో 2012 నుంచి యాహూ తన ఆదాయంలో తగ్గుదల నమోదు చేస్తూ వస్తోంది. మొత్తానికి యాహూ ఉద్యోగుల్లో ఎవరికీ ఉద్వాసన పలకనున్నారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

English summary

Worlds Popular IT company and search engine Yahoo to dismiss 16 thousand of its employees. This decision was taken because of its shares go down recently.Yahoo also Announced that its was going to close their offices in Argentina and Mexico.