వైఫ్ కి డైవోర్స్ ఇవ్వాలంటూ హీరో పై హీరోయిన్ ఒత్తిడి

Yami Gautam forcing Pulkit Samrat to take divorce from his wife

10:36 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Yami Gautam forcing Pulkit Samrat to take divorce from his wife

పెళ్ళాం ఉండగా, ఆ హీరోను ప్రేమించిన ఓ హీరోయిన్ ఇప్పుడు ఏకంగా భార్యకు డైవోర్స్ ఇచ్చేయాలంటూ, సదరు హీరోపై ఒత్తిడి పెంచేస్తోందట. బాలీవుడ్ లో గతంలో ఎంతో మంది స్టార్ హీరోలకు సంబంధించి ఇలాంటి గాసిప్స్ చాలానే బయటకు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఓ హీరోయిన్ కు సంబంధించి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా పాపులర్ అవ్వడంతో పాటు తెలుగు - హిందీ భాషల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్ ఇప్పుడు ఈ పుకార్లలో భాగమైంది. అవును, బాలీవుడ్ లో యామీ గౌతమ్, హీరో పులకిత్ సామ్రాట్ మధ్య కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుస్తోంది.

పులకిత్ సామ్రాట్, అతని భార్య శ్వేత గతేడాది అక్టోబర్ నుంచి విడిగా ఉంటున్నారట. దీంతో యామీ ప్రేమలో పడే భార్యకు ఇప్పటికే పులకిత్ దూరమయ్యాడని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, మన బంధం ముందుకు సాగాలంటే, భార్యతో విడాకులు తీసుకోవాల్సిందేనని పులకిత్ కు గట్టిగా చెప్పిందని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు ఈ రూమర్స్ పై పులకిత్ ఏమాత్రం క్లారిటీ ఇవ్వకుండా, తాజాగా తన సినిమా విడుదల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. విడాకులకు సంబంధించిన న్యాయ వ్యవహారాలు చూసుకునేందుకు తనకిప్పుడు సమయం లేదని అంటున్నాడు.

అటు యామీ గౌతమ్ కూడా హృతిక్ తో చేస్తున్న మొహాంజదారో సినిమా పనిలో బిజీగా ఉంది. ఇదికాక, పులకిత్, యామి గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా జునూనియత్ ఇటీవలే రిలీజవ్వడం, మిశ్రమ స్పందన రావడం తెల్సిందే.

English summary

Yami Gautam forcing Pulkit Samrat to take divorce from his wife