ఎనిమిదేళ్ళకే శివరంజని పట్టేశాడు

Yandamoori Veerendranadh Praises Devi Sri Prasad

09:34 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Yandamoori Veerendranadh Praises Devi Sri Prasad

ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్ర నాధ్ ఓ ఇంజనీరింగ్ కాలేజిలో స్పీచ్ ఇస్తూ , సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ని పొగిడేశారు. విద్యార్ధులు స్వశక్తితో ఎదగాలని ఆయన సూచిస్తూ , దేవీశ్రీ ఉదంతాన్ని ప్రస్తావించారు.

'నాన్న పేరు, మనం పదిమందికి పరిచయం చేసుకోవడానికే ఉపయోగపడుతుంది.అదే పేరు తో భవిష్యత్ ని నిర్దేశించుకోవచ్చు అనుకుంటే మాత్రం..ప్చ్. లాభం లేదు' అని యండమూరి అన్నారు.

"జగదేకవీరుడు అతిలోకసుందరి" సినిమాకి సంగీతం అందించిన ఇళయరాజా "అబ్బనీతియ్యనీదెబ్బ .." పాట వినిపించగానే అక్కడే కూర్చుని ఉన్న ఒక ఎనిమిదేళ్ళ కుర్రాడు.. ఇది "శివరంజని రాగం " లో ఉంది అన్నాడు. వెంటనే ఇళయరాజా నువ్వు పైకొస్తావ్ అని దీవించగా.. ఆ కుర్రాడే పెద్దయి దేవిశ్రీప్రసాద్ గా మన ముందున్నాడు.. అందుకే దేవిశ్రీని సరస్వతీ పుతృడు' అని యండమూరి మెచ్చుకున్నారు. దీంతో స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టారు..' దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారు ఎంతగొప్ప రచయితో అందరికీ తెలుసు కానీ దేవిశ్రీ మాత్రం స్వశక్తినే నమ్మాడు' అంటూ యండమూరి వివరించారు. స్వశక్తి ని నమ్ముకుంటే విజయం వరిస్తుందని అందుకు దేవీశ్రీ ఉదాహరణ గా ఆయన చెప్పారు.

English summary

Famous novel writer Yendamoori Veerendranadh Praises Star Music Director Devi Sri Prasad In the event in One Engineering College