ఆ సమయంలో యండమూరి టీ కూడా ఇవ్వలేదట

Yandamuri emotional speech

12:46 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Yandamuri emotional speech

ఒక సినిమా హిట్టయ్యిందంటే.. వచ్చే కిక్కు , రెస్పాన్స్ వేరు ... అదే ఒక సినిమా ఫ్లాపైందంటే మాత్రం.. అందరూ ముఖం చాటేస్తారు. కనీసం పలకరింపులు కూడా ఉండవ్. ఇది హీరో అవ్వచ్చు ... దర్శకుడు కావచ్చు .. రచయిత కావచ్చు .. సేమ్ ట్రీట్ మెంట్ .. ఒకప్పుడు నవలా రచయితగా యువ హృదయాలను కొల్లగొట్టిన యండమూరి వీరేంద్ర నాధ్ కి కూడా సినీ పరిశ్రమలో చేదు అనుభవం తప్పలేదు. ఈయన రాసిన పలు నవలల ఆధారంగా సినిమాలు వచ్చాయి. చిరంజీవి నటించిన అభిలాష , ఛాలెంజ్ , రాక్షసుడు, నాగార్జున నటించిన ఆఖరి పోరాటం ఇలా పలు చిత్రాలు హిట్ కొట్టాయి. కానీ 'స్టువర్టుపురం పోలీస్ స్టేషన్' సినిమా ప్లాప్ అవ్వడంతో యండమూరిని పలకరించిన వాళ్ళు లేరు. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా సెట్ కి వెళ్తే కనీసం టీ కూడా ఇచ్చిన పాపాన పోలేదట. మా టి వి అవార్డ్స్ ఫంక్షన్ లో అవార్డు స్వీకరిస్తూ స్వయంగా యండమూరి ఈమాటలు చెప్పారు. ఎన్నో ఆటు పోట్లు తట్టుకున్న విషయాన్ని ఆయన వివరిస్తూ యువతకు దిశా నిర్దేశం చేశారు.

ఇది కూడా చూడండి: అక్కడ ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట..

ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: డేర్ ఉంటే నైట్ టైం ఈ హర్రర్ మూవీస్ ఒంటరిగా చూడండి

English summary

Yandamuri emotional speech.