చరణ్‌ సర్జరీ గుట్టు విప్పిన యండమూరి!!

Yandamuri Veerendranath revealed secret of Charan surgery

07:12 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Yandamuri Veerendranath revealed secret of Charan surgery

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ ఒక ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో స్టూడెంట్స్‌ తో మాట్లాడుతూ, రామ్‌చరణ్‌, దేవిశ్రీప్రసాద్‌ల గురించి ప్రస్ధావించాడు. ఈ ప్రసంగంలో రామ్‌చరణ్‌ను, చిరంజీవి వారసుడిగా ఒక స్టార్‌ హీరోను చేసేందుకు చరణ్‌ తల్లి సురేఖ ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు. చరణ్‌ ముఖంలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి సర్జరీ కూడా చేయించుకున్నాడని చెప్పాడు. తరువాత దేవిశ్రీప్రసాద్‌ గురించి మాట్లాడుతూ దేవి 8 ఏళ్ళ వయసులోనే ఇళయరాజా ప్రసంసలు పొందాడు. ఇప్పుడు టాప్‌ సంగీత దర్శకుడిగా పేరు పొందాడు అని తెలిపాడు. జీవితంలో విజయం సాధించడం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ పై ఆధారపడుతుందని చరణ్‌-దేవీల ద్వారా నిరూపితమైందని ఆయన అన్నారు.

చరణ్‌ ఏం చేసినా చిరంజీవి వల్లే. కానీ దేవీ తన స్వతహాగా గుర్తింపు పొందాడని ఆయన తెలిపారు. మెగాస్టార్ ఫ్యామిలీకి సన్నిహితుడైన యండమూరి ఈ విధమైన వ్యాఖ్యలు చెయ్యడం వెనుక కారణం ఏముందో మరి.

English summary

Yandamuri Veerendranath revealed secret of Charan jaw surgery. Yandamuri Veerendranath went as a chief guest for College function and he talked about Charan and Devi Sri Prasad.