తారల నడుమ  తళుక్కుతార 'రేఖ'

Yash Chopra Award To Rekha

06:03 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Yash Chopra Award To Rekha

బాలివుడ్ లో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన అలనాటి అందాల తార రేఖకు యశ్‌ చోప్రా మెమోరియల్‌ అవార్డును ప్రదానం చేశారు. సోమవారం రాత్రి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌ రావు ఈ సందర్భంగా రేఖను సత్కరించారు . ఈ కార్యక్రమానికి సినీనటులు శ్రీదేవి, జయప్రద, రణ్‌వీర్‌సింగ్‌, నిర్మాత సుభాష్‌ ఘాయ్‌, శత్రుఘ్నసిన్హా, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తదితరులు హాజరయ్యారు. టి.ఎస్‌.ఆర్‌ ఫౌండేషన్‌ తరపున ఏటా ఈ అవార్డును ప్రకటిస్తారు . యశ్‌ చోప్రా దర్శకత్వంలో రేఖ 1981లో ‘సిల్‌సిలా’ చిత్రంలో నటించారు. చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజే స్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

English summary

Bollywood actress veteran heroine Rekha was awarded by Yash Chopra Memorial Award.This award was presented by Maharastra Governer Vidhya Sagar Rao.Acrtress Sri Devi,Jaya pradha,MP T.Subbi Raami Reddy and many were attended in to this event