తరచూ ఆవలింతలు రావడం మంచిదా? చెడ్డదా?

Yawning is Good Or Bad

12:10 PM ON 10th December, 2016 By Mirchi Vilas

Yawning is Good Or Bad

మనిషన్నాకా తుమ్ములు, ఆవలింతలు రావడం సహజం. కానీ ఆవలింత.. అని కంటిన్యూయెస్ గా ఓ 10 సార్లు అంటే కూడా ఖచ్చితంగా ఆవలింత వస్తుంది. ఇదే ఆవలింతలో ఉన్న మ్యాజిక్, అయితే దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఇంకా అంతుచిక్కని ఆవలింత పై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్రకారం శరీరం అలసటకు లోనైనప్పుడు ఈ ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు అంటు వ్యాధి రకానికి చెందినవి కాకపోయినా, ప్రతిస్పందనల రకానికి చెందిన ఆరోగ్యకరమైన చర్య అని చెప్తారు. అంటే ఆవలించే ఇతర వ్యక్తులను చూసినప్పుడు మనలో కూడా ఆటోమేటిక్ గా ఆవలింతలొస్తాయన్నమాట. వాస్తవానికి మనిషి శరీరం పూర్తిగా అలసిపోయి నిద్రకు వేళాయే అని పిలిచినప్పుడు ఆవలింతలు వాటంతట అవే వస్తాయి. కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా ఆవలింతలు వస్తాయి. అసలు ఆవలింతలు ఎప్పుడెప్పుడు వస్తాయి,అసలు ఆవలింత మంచిదా చెడ్డదా వంటి విషయాలు తెలుసుకుందాం ...

1/6 Pages

తల్లి కడుపులో ఆవలింత...

తల్లి గర్భంలో ఉండగానే ఆవలింత మొదలవుతుందంట. 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే భూమి మీదకు రాక ముందే ఆవలింత మనకి దగ్గరవుతుందన్న మాట. అంటే ఆవలింతే మన ఫస్ట్ ఫ్రెండ్ అని అంటారు.

English summary

Yawning was common thing in Man's routine life and so many people made research on yawning and lets us know now yawning is Good Or Bad.