ఎంఎల్ఏ లు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా?

Ycp MLA Kotamreddy Opposes Increase Of MLAs Salaries

10:18 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Ycp MLA Kotamreddy Opposes Increase Of MLAs Salaries

అందరికంటే భిన్నంగా వుండాలనుకున్నారో ... నిజంగా రాజకీయం చేయాలనుకున్నారో.. లేదంటే మనస్సాక్షి ప్రకారం ఆ మాట అన్నారో కానీ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి మాత్రం బుధవారం అసెంబ్లీలో అందరికన్నా బిన్నంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆయన వ్యతిరేకించారు. ఇంతవరకు ప్రతి విషయంలోనూ విమర్శలు , ప్రతి విమర్శలతో సభలో నడిస్తే, జీతాల విషయంలో మాత్రం టీడీపీ, వైసీపీలు ఏకతాటిపైకి వచ్చి ఓకే చెప్పేసాయి. అయితే వైసీపీలో ఒక్క కోటంరెడ్డి మాత్రమే వ్యతిరేకత వ్యక్తంచేశారు. ప్రభుత్వం - ప్రతిపక్షం కలసి తీసుకున్న నిర్ణయాన్ని తన అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించి వ్యతిరేకిస్తున్నానని అనేసారు.

ఇది కూడా చదవండి :ఇక హైదరాబాద్ కి చెల్లు చీటియా


'ఒకవైపు రాష్ట్రంలో నిధులు లేవని, ప్రజలు సహకరించాలని అంటారు. అంటే ప్రజలు త్యాగాలు చెయ్యాలి రాష్ట్రాన్ని పాలించే వారు త్యాగాలు చేయరా?' అని ఆయన సూటిగా అడిగే సరికి ఇటు అధికార పక్షం , అటు ప్రతిపక్షం కూడా షాక్ తిన్నాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి నచ్చిన ఏదో ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై టీడీపీ ప్రభుత్వం రెఫరెండం చేపట్టాలని ఆయన సూచించారు. ఒకవేళ దీనికి అనుకూలంగా ప్రజలు ఓటేస్తే...తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాలు విసిరారు. ప్రజాప్రతినిధులు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా? అని ఆయన నిలదీశారు. జీతాల పెంపును అంతా సమర్థిస్తున్నప్పటికీ తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : నన్ను ఏమైనా అనండి ... నా కొడుకుని అన్నారో ...


కోటం రెడ్డి చెప్పినట్లుగా ఏ నియోజకవర్గంలో సర్వే చేసినా ఎమ్మెల్యేల జీతాల పెంపును అందరూ వ్యతిరేకిస్తారా , పోనీలే అని సమర్ధిస్తారా ? మొత్తానికి ఈ సభలో ప్రస్తుతానికి హైలెట్ గా నిలించిన కోటం రెడ్డి తీరు గురించి పలుచోట్ల చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి :

ఎపి అసంబ్లీలో 'కంచె'

పోలీసులకే టోకరా వేసి , లక్షలు గుంజిన ఆటోవాలా

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో బాలీవుడ్ భామల క్యాట్‌ వాక్‌

English summary

Andhra Pradesh Government has decided to increase the Salaries on Andhra Pradesh MLA's and this decision was accepted by All Party MLA's but Yasrcp MLA Kotamareddy Opposed this increase on salary of MLAS's.He questioned that are MLA's were living by the Salaries.