బాబు సర్కార్ పై  అవిశ్వాసం  వైసిపి నోటీసు  

YCP party sends notice to AP CM Nara Chandra Babu Naidu

10:46 AM ON 10th March, 2016 By Mirchi Vilas

YCP party sends notice to AP CM Nara Chandra Babu Naidu

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పై వైసిపి అవిశ్వాస నోటీసు ఇచ్చింది. గురువారం ఉదయం వైసిపి ప్రతినిధులు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపు వైసిపి ఇచ్చిన అవిశ్వాసం నోటీసు పై స్పీకర్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా అసెంబ్లీలో నిన్నటిరోజున సీఎం చంద్రబాబు ప్రసంగించిన తర్వాత ప్రతిపక్ష నేత ఆరోపణలు, మంత్రుల ప్రత్యారోపణలతో సభ సుమారు అరగంటపాటు దద్దరిల్లడంతో మంత్రి యనమల జోక్యం చేసుకుని చర్చ తప్పుదారిపడుతోందంటూ రూల్‌ 329 కింద చర్చ ముగించినట్లు తీర్మానం (క్లోజ్‌ర్‌మోషన) ప్రవేశపెట్టారు.

స్పీకర్‌ ధన్యవాద తీర్మానం పై చర్చ ముగిసినట్లు ప్రకటించారు. స్పీకర్‌ ప్రకటనతో వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో ప్రతిపక్ష నేత జగన్‌ మినహా 47 మంది వైసీపీ సభ్యులను మిగిలిన రోజంతా సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఇక ఈవేళ సభ్యులు యధావిధిగా హాజరయ్యారు. స్పీకర్ కార్యదర్శికి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం అందించారు. కాగా బడ్జెట్ సమర్పించడానికి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సన్నద్దమవుతున్నారు.

English summary

YCP party sends notice to AP CM Nara Chandra Babu Naidu