ఆసనాల ద్వారా తలనొప్పి మటుమాయం

Yoga poses for headache

03:11 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Yoga poses for headache

యోగాసనాల ద్వారా తలనొప్పి, వత్తిడి నుండి ఉపసమనం పొందవచ్చు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా యోగాసనాలు వేయాల్సిందే. వీటిని తమజీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అంటే రోజూ లేవగానే టీ, టిపిన్‌ ఎలాగో అదే విధంగా లేవగానే యోగా చేయాలి అని మీరు అనుకోవాలి. రోజూ ఆసనాలు వేయడం వలన ఆరోగ్యంతో పాటు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదే విధంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరదు. ఎముకలు బలంగా మారుతాయి శరీరం బిగుతుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగాసనాలు చేయడం ఎంతో ముఖ్యం. యోగాకి ప్రత్యేకమైన రోజును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరింకెందుకు ఆలస్యం కొన్ని ఆసనాలను ఎలా చేయాలో నేర్చుకుందాం.

1/8 Pages

1. శవాసనం

  • మీ వీపుని నేలకు ఆనించి, కాళ్ళను నిటారుగా చాపి కళ్ళు మూసుకుని పడుకోవాలి.
  • ఇప్పుడు మీ అరి చేతులను ఓపెన్‌ చేసి నేలను తాకేటట్లు ఆనించాలి.
  • ఇప్పుడు మీరు శవాసనం చేస్తున్నారు. నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మీధ్యాస అంతా మీ శ్యాసమీదే ఉండాలి.
  • ఈ విధంగా 5 నుండి 10 నిమిషాలు పాటు చేయాలి.

English summary

The benefits of yoga are extensive. Not only yoga affects the physical aspect of the body, it addresses the mind and spirit as well.