ఆన్ లైన్ లో ఆవు పేడ‌

You can Buy cow dung in online

06:30 PM ON 12th December, 2015 By Mirchi Vilas

You can Buy cow dung in online

ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. మనకు కావాల్సిన ప్రతి వస్తువు ఆన్ లైన్ లో లభ్యమవుతోంది. అమ్మ‌కానికి కాదేది అన‌ర్హం అన్నట్టుగా ఆన్ లైన్ వ్యాపారులు తమ వ్యాపారాలను విస్త్రరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్ లైన్‌లో ఎలక్ట్రానిక్, గార్మెంట్స్, ఫుట్‌వేర్ ఐటమ్‌లే అమ్మడం చూశాం. కానీ ఇప్పుడు అమెజాన్‌లో ఆవుపేడ కూడా లభ్యమవుతున్నది. ఆవుపేడతో పాటు పేడతో చేసిన పిడకలు, గోమూత్రం కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. వీటికి ప్రత్యేక ఆఫర్స్ కూడా ఉన్నాయి. నాలుగు పిడకలు రూ.249 కాగా, ఎనిమిది పిడకలు రూ.319. ఆవుపేడను, గోమూత్రాన్ని పవిత్రంగా పూజించే మనదేశంలో ఈ పిడకలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అమ్ముడవుతున్నాయట. గోమూత్రాన్ని ఒక బాటిల్ ధర రూ.80గా ధర నిర్ణయించారు. ఆన్ లైన్ లో ఆవు పేడ‌కు, పిడ‌క‌ల‌కు డిమాండ్ బాగానే ఉంద‌ట‌.

English summary

Now You can buy anything on Indian e-commerce sites.Online e-commerce site Amazon sells even cow dung in online site