మీ ఫోన్ లో ఇతరులు ఏం చూశారో తెలుసుకోండిలా..

You can check the phone what others seen in your phone

04:33 PM ON 31st October, 2016 By Mirchi Vilas

You can check the phone what others seen in your phone

గతంలో ఫోన్ అంటే అదేదో పెద్దవాళ్ళకే పరిమితం అన్నట్టు స్టేటస్ సింబల్ గా ఉండేది. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లేని వాళ్లు చాలా అరుదు. సాధారణంగా ఒక మనిషి ఏ పని చేసినా అందులో మొబైల్ ఒక భాగమైపోతుంది. ఇప్పడు మనలో చాలామంది వారి వ్యక్తిగత విషయాలను సెల్ ఫోన్ లోనే దాచుకుంటున్నారు. అందులో నలుగురితో పంచుకునేవీ ఉంటాయి. రహస్యంగా దాచుకునేవీ ఉంటాయి. మరి మనం వాడుతున్న మొబైల్ ఎవరైనా తీసుకుంటే? అందులో రహస్యంగా దాచుకున్న డాటాను వాళ్లు చూస్తే? కొందరయితే మన మొబైల్ వాడుకున్నా, వారు ఏ యాప్స్ వాడారో తెలియకుండా క్లియర్ చేస్తారు. అలాంటి పరిస్థితిలో వాళ్లు ఏం చూశారో మనం తెలుసుకోగలిగితే బాగుండు అని చాలా మంది అనుకుంటారు.

అలాంటి వారి కోసమే ఓ ఫీచర్ వచ్చేసింది. మీ మొబైల్ నుంచి ఓ నంబర్ డయల్ చేసి తెలుసుకోవచ్చట. మీ మొబైల్ నుంచి *#*#4636#*#* డయల్ చేస్తే టెస్టింగ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో యూసేజ్ స్టాటిస్టిక్స్(మూడోది) అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ లో చివరిగా ఏ యాప్ ఏ సమయంలో ఎంతసేపు వాడారో మిల్లీ సెకన్లతో సహా తెలిసిపోతుందట. అయితే ఈ సౌకర్యం కొన్ని బ్రాండ్లలో మాత్రమే ఉందట.

పూర్తి వివరణ ఫోటోలతో కింద వివరించిన విషయాన్ని గమనించండి.

1/7 Pages

English summary

You can check the phone what others seen in your phone