ఆ రెస్టారంట్ లో తినాలంటే బట్టలిప్పాల్సిందే!

You can eat food without clothes in this restaurant

10:40 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

You can eat food without clothes in this restaurant

వెర్రి వెయ్యి రకాలు.. అందులో ఇదీ ఒకటి.. అవును మీరు టైటిల్ లో చూసింది నిజమే ఆ రెస్టారంట్ లో పూర్తిగా బట్టలు విప్పేసి(నగ్నంగా) కూర్చుని తినొచ్చు.. కానీ ఇదీ మన ఇండియాలో కాదులెండి.. అయితే ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. పదండి మరి ఇంకెందుకు ఆలస్యం.. భోజన ప్రియుల కోసం లండన్ లోని ఓ హోటల్ కొత్త వ్యూహంతో మన ముందుకొచ్చింది. విభిన్న రుచులను చవి చూడాలనుకునే వారి కోసం కొత్త నాందికి శ్రీకారం చుట్టింది. ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు ప్రత్యేక టాప్ అప్ లతో ఆహ్వానిస్తుంది.

1/6 Pages

ఔల్ కేఫ్:

'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభానికి స్థానిక 'ఔల్ కేఫ్' శ్రీకారం చుట్టింది. లండన్ ప్రజలకు మరింత చేరువవ్వాలన్న కాంక్షతో ఔల్ కేఫ్ కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు నేకెడ్ రెస్టారెంట్ ను ప్రారంభిస్తోంది. రెస్టారెంట్ డిన్నర్ లో అదనపు సౌకర్యంగా వినియోగదారులు 'బర్త్ డే డ్రెస్' లో భుజించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఎక్కడా లేని అదనపు సౌకర్యాలను వినియోగదారులకు అందించేందుకు లండన్ నగరంలోని ఓ హోటల్ ముందుకొచ్చింది.

English summary

You can eat food without clothes in this restaurant. In London you cat eat food with naked and non naked. This is latest restaurant in London. Now it is getting very famous throughout the world.