జీవితంలో ఎదగాలంటే… ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండాలట

You Should Always Try to Avoid These People

12:50 PM ON 20th July, 2016 By Mirchi Vilas

You Should Always Try to Avoid These People

మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలని అనుకోడు.. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని , ఎత్తుపల్లాలు అధిగమించి, ఉన్నతమైన జీవనం సాగించాలని కోరుకుంటాడు. అయితే మనుషులందరి స్వభావం ఒకేలా ఉండదు. కొందరు ఎప్పుడూ నవ్వుతూ - నవ్విస్తూ ఉంటే, మరికొందరు ఏదో పోగొట్టుకున్నట్టు ఆత్మన్యూనతతో బాధపడి పోతుంటారు. మరికొందరైతే అటూ ఇటూ కాకుండా ఒకసారి నవ్వుతూ, ఇంకోసారి సీరియస్ లుక్తో ఉంటారు. అయితే ఎవరెలా ఉన్నా ఏం బాధ లేదు. కానీ కొన్ని విలక్షమైన వ్యక్తిత్వాలు, మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలట. అవసరమైతే వారి నుంచి వీలైనంత దూరంగా వెళ్లడం మంచిదని అంటారు. లేదంటే వారి వల్ల మనకు ఎప్పటికీ కష్టాలే వెంటాడుతూ ఉంటాయట. అంతేకాదు మన జీవితంలో ఉన్న కొద్దిపాటి సంతోషం కూడా పోతుందట. ఇంతకీ అలాంటి వ్యక్తులు ఎవరెవరంటే,

1/7 Pages

ఇతరుల కష్టాలను చూసి ఆనందించే వాళ్ళు ...

సాధారణంగా ఎదుటివాళ్ళు కష్టంలో ఉంటే, అది తీర్చడానికి ప్రయత్నించాలి. కనీసం ఏమీ చేయకపోయినా పర్వాలేదు. కానీ కొంతమంది ఎదుటి వాళ్ళ కష్టాలను చూసి తెగ సంతోష పడిపోతుంటారు. సాధ్యమైంతవరకూ ఇలాంటి వ్యక్తుల నుంచి వీలైనంత దూరం మెయింటెన్ చేయడమే బెటర్. కొన్ని సార్లు పైకే హ్యాపీగా కనిపించినా, ఇతరులు బాధపడుతుంటే లోలోపల ఆనంద పడిపోతుంటారు. ఇలాంటి వాళ్లలో ఇంకో టైప్ ఎలా ఉంటారంటే, ఇతరులకు ఎప్పటికీ కష్టాలు, నష్టాలు కలిగిస్తూ ఆనందిస్తారు. కాబట్టి ఇలాంటి వారి నుంచి వీలైనంత వరకు దూరంగా జరిగితే మంచిదట.

English summary

You Should Always Try to Avoid These People.