ఫోర్బ్స్ సంపన్నుల లిస్టులో యంగ్ ఇండియన్స్

Young Indians Got Place In Forbes List Of US

11:36 AM ON 15th December, 2016 By Mirchi Vilas

Young Indians Got Place In Forbes List Of US

ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో కొత్తగా ఇద్దరు యంగ్ ఇండియన్లకు చోటు దక్కింది. అయితే ప్రస్తుతం వాళ్లిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. అందుకే ఇండియన్ అమెరికన్లు గా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. 40ఏళ్లలోపు వయసున్న అమెరికన్ సంపన్నుల లిస్టును ఒకటి ఫోర్బ్స్ విడుదల చేసింది..

1 . ఫస్టు ప్లేసులో జుకర్ బర్గ్

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అందులో ఫస్టు ప్లేసు కొట్టేశారు.

2. ఇక ఈ జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లు వివేక్ రామస్వామి - అపూర్వ మొహతాలకు చోటు దక్కింది. ఇందులో వివేక్ రామస్వామి వయసు 31. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం - యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో చదువుకున్నారు. బయోటెక్ పారిశ్రామికవేత్త అయిన ఆయనకు మొత్తం 600 మిలియన్ డాలర్ల సంపద ఉంది. ఫోర్బ్స్ జాబితాలో 24వ స్థానం దక్కించుకున్నారు. రామస్వామి కంపెనీ 2016లో స్టాక్ మార్కెట్ లో ముందస్తు పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కు వచ్చి 218 మిలియన్ డాలర్ల షేర్లను నాస్ డాక్ లో విక్రయించింది.

3. కాగా అపూర్వ మెహతాకు 31 వస్థానం దక్కింది. ఆయనది 360 మిలియన్ డాలర్ల సంపద. 2012లో నిత్యావసరాలను సరఫరా చేసే సంస్థ 'ఇన్ స్టాకార్ట్'ను ఆయన స్థాపించారు. భారత్ లో పుట్టిన మెహతా కుటుంబం 2000 సంవత్సరంలో కెనడాకు వచ్చింది. ఆయన బ్లాక్ బెర్రీ - క్వాల్కమ్ - అమెజాన్ లలో పనిచేశారు. కాగా ఫోర్బ్స్ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన జుకర్ బర్గ్ సంపద విలువ 50 బిలియన్ డాలర్లు.

ఇవి కూడా చదవండి: 1లీ”కోక్ తయారీకి, 9లీ” నీళ్ల్లు? గ్రామాల్లో క్షీణిస్తున్న భూగర్భజలాలు, తప్పని నీటి కష్టాలు

ఇవి కూడా చదవండి: రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

English summary

Two Young Indians named Apoorva Me,ta and Vivek Ramaswamy were listed as the richest Richest Entrepreneurs Under 40 in USA which was released by Forbes.