అనుష్కతో నాగశౌర్య డేటింగ్

Young star Naga Shourya dating with famous heroine

10:51 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Young star Naga Shourya dating with famous heroine

అవునా అంటే, అవునని హీరో నాగశౌర్య అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన అనుష్కతో డేటింగ్ అన్నవార్త ఎప్పడు బయటకి రాలేదెందుకని ప్రశ్నించాడు కూడా. నాగశౌర్య-నిహారిక జంటగా నటిస్తోన్న ఒక మనసు సినిమా ప్రమోషన్ లో భాగంగా చెప్పిన సంగతుల్లో తన మనసులో మాటని నాగశౌర్య ఈవిధంగా బయటపెట్టాడు. ఓసారి వివరాల్లోకి వెళ్దాం. 'నాతో కలిసి నటించిన రాశీ ఖన్నా, సోనారిక ..ఇప్పుడు నిహారికతో డేటింగ్ అంటున్నారు. ఆఖరికి రెజీనాతో నటించక పోయినా తనతో కూడా డేటింగ్ చేస్తున్నానంటూ రాసేశారు. అయితే, అనుష్క పేరుమాత్రం ఈ లిస్ట్ లో చేర్చడంలేదు ఎందుకనో' అంటూ నాగశౌర్య మీడియాకు వింతైన ప్రశ్న సంధించాడు. తనతో నటించిన హీరోయిన్లు అందరితో తను డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు రావడంపై నాగశౌర్య స్పందిస్తూ, ఇన్ని రాస్తున్నారు సరే,తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరని అడిగితే, అనుష్క అంటూ తాను ఎన్నోసార్లు సమాధానమిచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే, తాను చేసిన హీరోయిన్స్ లో నిహారిక , మాళ విక తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఫీలయ్యానని చెప్పాడు.

ఇది కూడా చూడండి: శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

ఇది కూడా చూడండి: మన తెలుగు రాష్ట్రాల చిహ్నాల గురించి మీకు తెలుసా?

ఇది కూడా చూడండి: ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

English summary

Young and handsome hero Naga Shourya. Few of the media agencies have aggressively promoted the gossips. so handsome hero Naga Shourya reacted simply and rejected all