ఆ ఏడుపు ఆపుకున్న ఎన్టీఆర్...

Young Tiger Ntr controlled his tears

03:31 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Young Tiger Ntr controlled his tears

బావ కళ్ళల్లో ఆనందం కోసం... అనే డైలాగ్ విన్నాం కదా. కానీ ఇది అలాంటిది కాదు. నిజంగా అభిమానుల కళ్ళల్లో ఆనందం కోసం యంగ్ టైగర్ పడిన శ్రమ 'జనతా గ్యారేజ్' తీర్చిందనే చెప్పాలి. అందుకే మంగళవారం జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో అభిమానుల సమక్షంలో జరిగిన ఆ సినిమా విజయోత్సవంలో జూనియర్ ఉద్వేగంతో మాట్లాడాడు. ఈ వేడుకలో హీరో కల్యాణ్ రామ్, దర్శకులు కొరటాల శివ, సుకుమార్, చిత్ర నిర్మాతలు నవీన, రవిశంకర్, మోహన, నటులు సాయికుమార్, సురేష్, గేయ రచయిత రామజోగయ్యశాస్త్రితో పాటు దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య పాల్గొన్నారు.

1/6 Pages

'ఈ రోజు నాకింతకంటే కావాల్సింది ఏమీలేదు. జనతా గ్యారేజ్ వల్ల అభిమానులందరి కళ్లల్లో ఆనందం చూడగలిగా. మా అమ్మానాన్నలకు వాళ్ల పుట్టినరోజుకు ఓ కానుక ఇవ్వగలిగా. ఈ విజయం కోసమే ఇన్నాళ్లూ ఎదురుచూశా. ఈ రోజు అందరిముందూ తలెత్తుకు తిరిగేలా చేసిన జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటా. మా గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే విజయం ఇది. ఆనందంతో వచ్చే ఏడుపు ఆపుకుంటున్నా. ఈ జన్మకు ఇది చాలు'. నిజంగా అభిమానులనందర్నీ ఆనందపెట్టడమే నా ముఖ్య ఉద్ధేశం. అది చెయ్యగలుగుతున్నానంటే మా తల్లిదండ్రులిచ్చిన జన్మ వల్ల. ఒక మహామనిషి నందమూరి తారకరామారావు కుటుంబంలో జన్మించడం ఇంకో అదృష్టం. బతికినంత కాలం అభిమానుల్ని ఆనందింపజేయడానికి బతుకుతా అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

English summary

Young Tiger Ntr controlled his tears. Young Tiger Ntr attends Janatha Garage success meet in Jubilee hills. And he talks about the fans and movie with emotionally.