'బాబు బంగారం' లో ఎన్టీఆర్

Young Tiger Ntr in Babu Bangaram

12:33 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Young Tiger Ntr in Babu Bangaram

దృశ్యం, గోపాల.. గోపాల.. వంటి ఘన విజయాలు తరువాత చాలా గ్యాప్ తీసుకుని విక్ట‌రీ వెంక‌టేష్ నటిస్తున్న తాజా చిత్రం 'బాబు బంగారం'. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం టాకీ భాగం చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేసుకుని యూర‌ప్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జరుపుకోవడానికి వెళ్ళింది. జూలైలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట. గ‌తంలో కూడా వెంకటేష్ న‌టించిన 'చింత‌కాయ‌ల ర‌వి' చిత్రంలోని ఓ పాట‌లో ఎన్టీఆర్‌-వెంకీ క‌లిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రంలో మళ్లీ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. భలే భలే మగాడివోయ్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న మారుతి వెంటనే విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. మొత్తం మీద ఈ చిత్రంతో మారుతి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేట్టు ఉన్నాడు.

English summary

Young Tiger Ntr in Babu Bangaram. Young Tiger Ntr playing guest role in Victory Venkatesh Babu Bangaram movie.