'జనతా' స్టోరీ లీక్ చేసిన ఎన్టీఆర్!

Young tiger Ntr leaked Janatha Garage movie story

05:40 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Young tiger Ntr leaked Janatha Garage movie story

సినిమాకు ముందు స్టోరీ అస్సలు బయటకు పొక్కకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. ఎదో విధంగా బయటకు వచ్చేస్తూనే వుంది. తాజాగా గురువారం విడుదలయ్యే 'జనతా గ్యారేజ్' సినిమా స్టోరీ కూడా బయటకు వచ్చేసింది. గ్యారేజ్ అనేది ఓ ఫ్యామిలీ స్టోరీ అని, ఇందులో ఒకతను మొక్కల్ని ప్రేమించే వ్యక్తయితే, ఇంకొకతను మనుషుల్ని ప్రేమించే వ్యక్తి. వాళ్లిద్దరూ ఎలా ఏకమవుతారని, వాళ్లిద్దరూ కలిసి ప్రకృతినీ, మనుషుల్నీ ఎలా బ్యాలన్స్ చేస్తారనేదే ఈ సినిమా కథాంశంగా చెబుతున్నారు. 'జనతా గ్యారేజ్' అనే సిస్టమ్ ను వాళ్లెలా నిలబెడతారనేది కథ. అసలు ఈ స్టోరీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

1/3 Pages

ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును అనే ఉప శీర్షికకు తగ్గట్లు అన్నిట్నీ రిపేరు చేసే ఆ గ్యారేజ్ లో మనుషుల్ని కూడా రిపేరు చేస్తారు. 'జనతా గ్యారేజ్' సినిమా బాగుండబోతుందనే నమ్మకం మొదట్నించీ ఏర్పడింది. మనసులో పాజిటివ్ నెస్ ఉంటే అంతా మంచిగానే కనిపిస్తుంది. నెగటివ్ గా తీసుకుంటే అంతా నెగటివ్ గానే కనిపిస్తుంది. ఫలితాన్ని పక్కనపెడితే.. మనిషికి పాజిటివిటీ అనేది చాలా ముఖ్యం. అఫ్ కోర్స్.. మనం నమ్మిన ప్రతిదీ నిజం కానక్కర్లేదు. మనం కేవలం మనుషులం. దేవుళ్లం కాదుగా. హోప్ అనేది ఉండాలి. ఈ చిత్రంలో మెకానిక్ ఆనంద్ అని కాకుండా ఓ ప్రకృతి ప్రేమికుడి పాత్రను చేయడం నాకు సవాలుగా అనిపించింది.

English summary

Young tiger Ntr leaked Janatha Garage movie story. Janatha Garage movie story was leaked by Ntr