నాగార్జునకు యంగ్ టైగర్ పరామర్శ!

Young tiger Ntr meets his fan

03:30 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Young tiger Ntr meets his fan

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని చెబుతుంటారు అభిమానులు. సరిగ్గా ఇదే విషయాన్ని తాజాగా నిరూపించుకున్నాడు. అభిమానులే నా దేవుళ్లని చెప్పే జూనియర్ ఎన్టీఆర్, తన పెద్దమనసేంటో మరోసారి చూపించాడు. బెంగుళూరుకు చెందిన తన వీరాభిమాని, కేన్సర్ పేషెంట్ అయిన నాగార్జునను పరామర్శించాడు. నాగార్జున కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పాడు. నాగార్జున కేన్సర్ తో బాధపడుతూ, మృత్యువుతో పోరాడుతున్నాడు. తన చివరికోరికగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవాలనుకున్నాడు.

1/7 Pages

విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కేరళ షూటింగ్ ను కూడా వాయిదా వేసుకుని అభిమానిని పరామర్శించాడు.. నాగార్జున కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయం చేస్తానన్నారు. అభిమానులే కాదు, అభిమానులను మేము కూడా అభిమానిస్తాం, ప్రేమిస్తాం' అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

English summary

Young tiger Ntr meets his fan