చెన్నైలో జయలలితను ఎన్టీఆర్ ఎందుకు కలిసినట్టు?

Young Tiger Ntr meets Jayalalitha in Chennai

12:55 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Young Tiger Ntr meets Jayalalitha in Chennai

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీకి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రం షూటింగ్ కోసం చెన్నై వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఇటీవలే ముఖ్యమంత్రిగా ఎన్నికైన జయలలితను ఎన్టీఆర్ కలిసాడట. అసలు జయను ఎన్టీఆర్ కలవడం వెనుక అంతర్యం ఏమిటా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. దానికి తోడు పక్కనే తిరుపతిలో టీడీపీ మహానాడు కూడా జరుగుతుంది ఆ కార్యక్రమానికి వెళ్ళకుండా జయను ఎందుకు కలిసాడు అనే కథనాలు మీడియాలో ఊపందుకున్నాయి. మరో వైపు హరికృష్ణ కూడా మహానాడుకు హాజరు కాలేదు.

దాంతో ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరూ టీడీపీకి కావాలనే దూరంగా ఉంటున్నారా? లేక దూరం పెట్టారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.. ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ ఆగష్టు 12న విడుదల కాబోతుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

English summary

Young Tiger Ntr meets Jayalalitha in Chennai.