12.5 లక్షలు గెలుచుకున్న 'ఎన్టీఆర్'!!

Young tiger ntr won 12.5 lakhs prize money

06:04 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Young tiger ntr won 12.5 lakhs prize money

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'మీలో ఎవరు కోటేశ్వరుడు' షో లో కనిపించి త్వరలో కనువిందు చెయ్యనున్నాడు. ఈ షో ఇప్పటికే 'మా టీ'వి ఛానెల్ లో అత్యధిక టి ఆర్ పి రేట్లు టి ఆర్ పి రికార్డ్ సృష్టించి ప్రజాధరణ పొందింది. ఇప్పుడు ఈ గేమ్ షో కొంతమంది స్టార్స్ వాళ్ళ సినిమా లను ప్రమోట్ చేసుకోవడానికి అవకాశమిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్ హాట్ సీట్ లో కనిపించనున్నాడు. ఈ షో లో 'నాన్నకు ప్రేమతో' సినిమా గురించి ప్రమోట్ చెయ్యనున్నాడు. ఈ షో షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్ 12 ప్రశ్నలకు టక టకా సమాధానం చెప్పి 12.5 లక్షలు ఫ్రైజ్ మనీ ని గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన సెలెబ్రిటీ లలో ఎక్కువ ఫ్రైజ్ మనీ గెలుచుకుంది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. మరో వైపు నాగ్ సొగ్గాదే చిన్ని నాయనా సంక్రాంతి కానుకగా జనవరి 15 న రిలీజ్ కానుంది.

English summary

Young tiger ntr won 12.5 lakhs prize money in 'Meelo Evaru Koteswarudu' game show. Ntr is the first celebrity that won highest prize money in this game show.