మీరు పుట్టిన టైం తో భవిష్యత్ ఎలా ఉంటుందో ఇలా తెలుసుకోవచ్చిలా

Your Birth Time Says About Your Future

03:38 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Your Birth Time Says About Your Future

చాలామంది దగ్గర మనం వినే మాట ఏంటంటే, 'టైం బ్యాడ్'. నా టైం బాలేదు వంటి మాటలు అసలు ఎందుకంటున్నారో తెలీదు. సాదారణంగా ఎవరికైనా అనుకున్నది జరగకపోయినా, ఎప్పటికప్పుడు కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నా, కొందరైతే తమ జాతకం బాగా లేదని భావిస్తారు. ఇంకొందరికైతే అనుకున్నవి కాకుండా అనుకోనివి కూడా కలసి వస్తుంటాయి. వారికి టైం బాగుంది, కాబట్టే అంతలా కలిసివస్తుందని అందరూ భావిస్తారు. అయితే జాతకాలను, జ్యోతిష్యాన్ని నమ్మే వ్యక్తులు ఇలా చెబుతారు. వాటిపై నమ్మకం లేని వారు అస్సలు వాటిని పట్టించుకోరు, అది వేరే విషయం. కానీ జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారమైతే టైంకు, జాతకానికి సంబంధం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించిన తేదీ, సమయాలను బట్టేగా పండితులు వారి జాతకాలను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో ఎవరైనా రోజులో ఒక నిర్దిష్ట సమయంలో జన్మిస్తే వారు కొన్ని లక్షణాలను, మనస్తత్వాలను కలిగి ఉంటారట. ఆ సమయాన్ని బట్టే వారి జాతకం గురించిన కొన్ని విషయాలను తెలుసుకోవచ్చట.అందుకే పుట్టిన సమయాన్ని బట్టి వారి లైఫ్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వం కూడా దాన్ని బట్టే వుంటుందట. అదేంటో చూద్దాం.

1/13 Pages

ఉదయం 4 - 6 గంటల మధ్య...

ఈ సమయంలో పుట్టినవాళ్ళు అనారోగ్య సమస్యను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులకు ఉన్న అసూయ కారణంగా వీరు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అనుకున్న పనిని పూర్తి చేయడంలో అమితమైన పట్టుదలను కలిగి ఉంటారు. తమపై తమకు దృఢమైన నమ్మకం ఉంటుంది. వీరి భవిష్యత్ ఆశించిన స్థాయిలో ఆశాజనకంగానే ఉంటుంది. కానీ వీరు అనుకున్నవి చాలా నెమ్మదిగా జరుగుతాయి. అయితే అలా నెమ్మదించినా చివరకు వీరు తాము అనుకున్నది సాధించి తీరుతారు.

English summary

Your Birth Time Says About Your Future.