మీకు నచ్చిన రంగు ఏం చెప్తుంది?

Your  favourite color says about your personality

04:20 PM ON 28th December, 2015 By Mirchi Vilas

 Your  favourite color says about your personality

ప్రతి ఒక్కరికి ఒక్కో క్యారెక్టర్‌ ఉంటుంది. అందరికీ ఒకే విధమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉండవు. ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకరికి అది నచ్చకపోవచ్చు. అలాగే రంగులు బట్టి మనస్థత్వాలను తెలుసుకోవచ్చు. అందరికీ ఒకేరంగు నచ్చదు. కొందరికి డార్క్‌ కలర్స్‌ అంటే ఇష్టం. ఇంకొకరికి లైట్‌ కలర్స్‌ అంటే ఇష్టం. ప్రత్యేకంగా ఉండాలి అనుకునేవారు ప్రత్యేకమైన రంగులను ఎంపిక చేసుకొని వాటికి తగ్గట్టుగానే అన్నీ నప్పే విధంగా తయారు అవుతుంటారు. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మగువులు ఎక్కువ శాతం పింక్‌నే ఇష్టపడతారంట. మీకు నచ్చిన రంగు ఏంటో చూసుకోండి మరి.

 

1/11 Pages

రెడ్‌ కలర్‌

రెడ్‌ కలర్‌ని ఇష్టపడేవారు ఒక ప్రత్యేకమైన అభిరుచి కలిగి ఎంతో ఉత్సాహంగా మీ కలలను మరియు లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఎటువంటి బెదురు లేకుండా ఎటువంటి సమస్యనైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. కాని అనుకున్న పని జరగకపోయినా, ఆశించింది నెరవేరక పోయినా వెంటనే అసహనానికి లోనై అప్‌సెట్‌ అయిపోతారు. వీరిలో కొంతమంది వారికే అన్నీ తెలుసు అనే విషయాన్ని ఎదుటివారికి తెలియాలి అనుకునేలా వారు ప్రవర్తిస్తారు. వీరు దూకుడు స్వభావం కలిగి, ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌ గా ఉంటారు.

English summary

Do you know Your  favourite color says about your personality. Read this entire article for more information.