వైజాగ్ రైల్వేస్టేషన్ కి తరలివస్తున్న కుర్రాళ్ళు.. ఇంతకీ అక్కడ ఏముంది?

Youth are coming to Vizag railway station for using wifi

06:16 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Youth are coming to Vizag railway station for using wifi

విశాఖపట్నం రైల్వేస్టేషన్ కి కాలేజీ కుర్రాళ్ళు, యువకులు తరలి వస్తున్నారు.. అంతగా తరలి రావడానికి ఇంతకీ అక్కడ ఏముంది? ఆశ్చర్యపోయే సంఘటన ఏమైనా ఉందా? లేక ఏమైనా గొప్ప విషయం చోటు చేసుకుందా? అనే ప్రశ్నలు మీలో మొదలవ్వచ్చు. కానీ అవేమీ కాదు.. అయితే అసలు విషయమేమిటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇంతకీ ఏంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే విశాఖపట్నంలో ఈ ఫ్రీ ఇంటర్నెట్ ను కొంతమంది తమ స్వార్థానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు.

రైల్వే ప్రయాణికులు వేచి ఉండే సమయంలో కాలక్షేపం కోసం ఈ ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఉచిత ఇంటర్నెట్ కూడా అరగంట మాత్రమే పని చేస్తుంది. మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ(One Time Password) ద్వారా ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసుకోవచ్చు. అయితే విశాఖ రైల్వే స్టేషన్ లో కొంతమంది యువకులు కాలేజీలకు డుమ్మా కొట్టి మరీ వైఫై కోసం స్టేషన్ కు వస్తున్నారని తెలిసింది. ప్లాట్ ఫాం టికెట్ కొనుక్కుని వెళ్లి స్టేషన్ లో కాలక్షేపం చేస్తున్నారు. వీడియోలు, సాంగ్స్, సాఫ్ట్వేర్స్ వెర్షన్స్ అప్ డేట్ చేసుకుంటూ యువత టైం పాస్ చేస్తుండటంతో ఇతర ప్రయాణికులు పూర్తిస్థాయిలో ఈ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు.

ఈ విషయాన్ని ఆర్ఫీఎఫ్ పోలీసులు చాలా రోజులకు గుర్తించారు. ఏ ట్రైన్ వచ్చినా ఎక్కకుండా స్టేషన్ లో టైంపాస్ చేస్తున్న కుర్రాళ్లను తాము గమనించామని, తీరా ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చిందని రైల్వే అధికారి తెలిపారు. గూగుల్ సహకారంతో రైల్ టైల్ ఈ ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. విశాఖ రైల్వేస్టేషన్ లో దాదాపు రోజుకు 700మంది ఫ్రీ వైఫైలో లాగిన్ అవుతున్నారని రైల్ టెల్ డిప్యూటీ మేనేజర్ చైతన్య తెలిపారు. అరగంట మాత్రమే ఫ్రీ వైఫై పొందేందుకు వీలుండటంతో, రకరకాల నంబర్లను ఉపయోగించి ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.

English summary

Youth are coming to Vizag railway station for using wifi. College students and youth are coming very much to vizag railway station to use free wifi.