ఫ్రీ వైఫైతో యువత ఏం చేస్తున్నారో తెలిస్తే దిమ్మతిరుగుతుంది!

Youth is opening romantic sites with free wifi in railway stations

11:18 AM ON 18th October, 2016 By Mirchi Vilas

Youth is opening romantic sites with free wifi in railway stations

ఫ్రీగా వస్తే ఫినాయిలు తాగడానికైనా వెనుకాడరని మనకు ఓ సామెత ఉంది కదా. ఎందుకంటే ఫ్రీ అంటే చాలు వాటిని అందుకోవడానికి ఎగబడతారు.. ఇక ఫ్రీగా వైఫై సౌకర్యం కూడా అంతేనండి. దానివల్ల వచ్చే అనర్థాలను పక్కనబెడితే, ఉచిత వైఫైని ఉపయోగించి యువత ఏం చేస్తున్నారో తెలిస్తే గుండె గుభేల్ మంటుంది. ఎందుకంటే ఎక్కువమంది ఈ ఫ్రీ వైఫై కారణంగా పోర్న్ సైట్లు చూస్తున్నారట. ఈ విషయాన్ని రైల్వే అధికారులే స్వయంగా చెప్పుకొచ్చారు. రైల్ టెల్ సంస్థ గూగుల్ తో కలిసి ఉచితంగా వై-ఫై సర్వీస్ ని అందిస్తోన్న విషయం తెల్సిందే! రీసెంట్ గా రైల్వేశాఖ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడంలో పాట్నాది టాప్ ప్లేస్.

ముఖ్యంగా పోర్న్ సైట్లను వెతకడానికే ఇంటర్నెట్ ని వాడుతున్నట్లు రైల్ టెల్ ప్రతినిధి వెల్లడించారు. ఆయా వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడం ఇక్కడ ఎక్కువగా ఉందట. యూట్యూబ్, తర్వాత వికీపీడియాలను ఈ స్టేషన్ లో చూస్తున్నారట. బీహార్ లో ఉచిత వైఫై పొందిన ఫస్ట్ స్టేషన్ పాట్నాయే కావడం గమనార్హం. ప్రయాణికులు, ముఖ్యంగా యువత ఉచిత ఇంటర్నెట్ కోసమే పాట్నా స్టేషన్లకు రావడంతో నెట్ స్పీడు తగ్గిపోతోంది. అందుకే దాన్ని పెంచాలని రైల్ టెల్ భావిస్తోంది. ఈ సిటీ తర్వాత ఇంటర్నెట్ సెర్చిలో జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లున్నాయి.

ప్రస్తుతం రోజుకి ఒక గిగాబైట్ డేటాని ఉచితంగా అందిస్తోంది.. దీన్ని 10 గిగాబైట్లకు పెంచాలని భావిస్తోంది. ఏపీలోని విశాఖపట్నం, పట్నా, రాంచీ సహా దేశంలోని 23 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అమల్లో వున్నాయి.

English summary

Youth is opening romantic sites with free wifi in railway stations