స్లిమ్ గా కనపడేందుకు యూత్ ఏం చేస్తుందో తెలిస్తే షాకౌతారు!

Youth is smoking cigarettes to reduce weight

11:48 AM ON 18th October, 2016 By Mirchi Vilas

Youth is smoking cigarettes to reduce weight

ప్రతి ఒక్కరినీ వేధించే సమస్యల్లో ప్రధానంగా భారీకాయం. అవును, స్థూలకాయన్ని, అధిక బరువును తగ్గించుకునేందుకు యువతీయువకులు చేస్తున్న పనేంటో తెలిస్తే షాకవుతారని చెప్పక తప్పదు. అధిక బరువును తగ్గించుకుని సన్నబడాలని భావిస్తున్నవారు సిగరెట్లను ఊది పారేస్తున్నారట. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనం ప్రకారం, అమెరికాలో 46 శాతం మంది అమ్మాయిలు, 30 శాతం మంది పురుషులు స్లిమ్ అవడం కోసం సిగరెట్లకు అలవాటు పడినట్టు తేలింది. హెల్త్ ఎకనామిక్స్ అనే జర్నల్ లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

1/4 Pages

తమ శరీర బరువు సరిగానే ఉందని చెప్పే అమ్మాయిల కంటే, తాము చాలా బరువుగా ఉన్నామని 225 శాతం మంది పొగతాగే అమ్మాయిలు చెప్పారు. స్మోకింగ్ చేసే అబ్బాయిల్లో 145 శాతం మందే తాము అధిక బరువును తగ్గించుకునేందుకు పొగ తాగుతున్నట్టు చెప్పారు. అబ్బాయిలతో పోలిస్తే అధిక బరువు వల్ల అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల వల్లే ఈ తేడా అని అధ్యయనకారులు తెలిపారు.

English summary

Youth is smoking cigarettes to reduce weight