యూట్యూబ్‌లోనూ ట్రెండింగ్ ట్యాబ్

YouTube New Trending Video Feature

04:22 PM ON 15th December, 2015 By Mirchi Vilas

YouTube New Trending Video Feature

ఫేస్ బుక్, ట్విట్టర్ మొదలైన సామాజిక వెబ్ సైట్లు ట్రెండింగ్ పేరుతో పాపులర్ షేర్లను, వీడియోలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ కూడా ఇదే రూట్ ఫాలో అవుతోంది. రోజు వేల కొద్దీ వీడియోలతో నెటిజన్లు యూట్యూబ్ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సైట్‌లో పాపులర్‌గా ఉన్న వైరల్ వీడియోల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ట్రెండింగ్ ట్యాబ్ ను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు పాపులర్ వీడియోలను చూడాలనుకుంటే మనమే వాటిని వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ అందిస్తున్న ట్రెండింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు సులువుగా వైరల్ వీడియోలను వీక్షించవచ్చు. హోం పేజీలో ఈ ఫీచర్‌ను ట్యాబ్ రూపంలో ఏర్పాటు చేశారు. దీన్ని క్లిక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు చూస్తున్న వీడియోలు మనకు మన ప్రాంతాన్ని బట్టి స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ఈ ఫీచర్ డెస్క్‌టాప్ పీసీలతోపాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లలోనూ పనిచేస్తుంది. మరి మీరు కూడా ఓ సారి ట్రై చేసేయండి.

English summary

As social networking sites like facebook and twitter now youtube also add a new trending video feature in which we can get trending videos over there