చెప్పుతో కొట్టాలన్న జగన్ ని ఏకి పారేసిన మంత్రులు

YS Jagan faces criticism

01:40 PM ON 4th June, 2016 By Mirchi Vilas

YS Jagan faces criticism

చంద్రబాబును చెప్పుతో కొట్టాలని వైసిపి నేత జగన్ చేసిన వ్యాఖ్య లపై సిఎమ్ చంద్రబాబుతో సహా మంత్రులు , టిడిపి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ రేంజ్ లో కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. నలు చెరగులా దుమ్మెత్తి పోస్తున్నారు.

1/8 Pages

అయినా సిగ్గు లేదా అంటున్న చంద్రబాబు ...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మండిపడుతూ, జగన్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. జైలుకెళ్లి వచ్చిన జగన్ సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ చాలా నీచంగా మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని కొట్టాలని చెప్పే ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టకరమన్నారు. ఇలాంటి రౌడీ, నేరస్థుడు విపక్షనేతగా ఉంటే, పెట్టుబడులు పెట్టేవారు భయపడతారని ఆయన అన్నారు.

English summary

YS Jagan faces criticism.