చండీయాగంలో జగన్ !

YS Jagan Planning To Do Chandi Yagam

10:53 AM ON 10th September, 2016 By Mirchi Vilas

YS Jagan Planning To Do Chandi Yagam

ఇది కొంచెం వినడానికి ఆశ్చర్యంగా వున్నా, నిజం. దృష్టశక్తులను పారదోలి, రాబోయేరోజుల్లో అంతా మంచి జరగాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ చండీయాగానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జగన్ ఏ పని చేపట్టినా రివర్స్ అవుతోందని ఆ పార్టీ నేతలు బలంగా భావిస్తున్నారు. ఈక్రమంలో ఓ పెద్దాయన ఇచ్చిన సలహా మేరకు ఈ యాగం చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. దసరా సందర్భంగా ఈ యాగానికి జగన్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

కొద్దిరోజులుగా పండితులతో పూజలు చేయించడం, పీఠాధిపతులతో జగన్ ఆశీర్వాదాలు తీసుకుంటున్న నేపథ్యంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని ప్రత్యేకంగా కలిశారు. చండీయాగం ద్వారా తాను హిందువులకు వ్యతిరేకిని అనే ముద్ర పోగొట్టుకోవచ్చనని జగన్ భావిస్తున్నారని, అప్పుడే ఆ పార్టీ నేతలు లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ యాగం ఎప్పుడు, ఎక్కడ మొదలవుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారట.

ఇవి కూడా చదవండి:వీళ్ళు ... ఎపి క్యాబినెట్ లోకి వచ్చేస్తున్నారట

ఇవి కూడా చదవండి:ఆమె నాలుక బీమా విలువ తెలిస్తే షాకవుతారు

English summary

YSR Congress Party Chief Y.S.Jagan Mohan Reddy was facing some troubles and now according to a new update came to know that Y.S.Jagan was planning to do Chandi Yagam. One of the Hindu Preist Adviced Jagan to do Chandi Yagam to overcome all problems.