కారుని డీ కొట్టేందుకు అంతా కల్సిపోయారు

Ysrcp Congress TDP Joined Hands For Paleru Election

09:39 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Ysrcp Congress TDP Joined Hands For Paleru Election

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే నని మరోసారి రుజువైంది. కత్తులు దూసే బద్ధ శతృవులు ఒకటైపోతారు. మంచి మిత్రులు సడన్ గా దూరమైపోతారు. ఇక్కడ మనం చూసే పోస్టర్లో కాంగ్రెస్ రధ సారధులు సోనియాగాంధీ - రాహుల్ గాంధీ - టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఆ పార్టీ అధినేత చంద్రబాబు - దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇదేదో వెటకారానికి, ఎవరినో ఇబ్బంది పెట్టడానికి వేసిన ఫ్లెక్సీ కాదు. అందరు నేతలు కల్సి ఏకబిగిన కాంగ్రెస్ కు ఓటు వేయమని ప్రజలకు పిలుపు ఇచ్చేలా ఈ పోస్టర్ దర్శన మిస్తోంది. చూసేందుకు వింతగా అనిపించినా ఇప్పుడు అదే తెరమీదకు వస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడంటే, తెలంగాణాలోని ఖమ్మం జిల్లా పాలేరులో జరుగుతున్న ఉప ఎన్నికల వేళ వెలిసిన పోస్టర్ ... ఇప్పుడు ఈ పోస్టర్ ఓ సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి:

భవిష్యత్తు రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ పోస్టర్ లానే తెలంగాణ రాజకీయాలు మారనున్నాయని అంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన పార్లమెంటు - అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ దెబ్బకు ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కని పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి. చివరకు గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తప్పదని ఆశించిన విపక్షాలు విస్తుపోయే విధంగా టీఆర్ఎస్ కు 99 డివిజన్లలో జెండా ఎగరేసింది. తరువాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను సైతం కైవసం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో విపక్షాలు ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు చేయడమే కాకుండా ఎన్నికల్లో సైతం కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి.శాసనమండలి ఎన్నికల్లో లోపాయికారిగా టీడీపీ - కాంగ్రెస్ కు పలు జిల్లాల్లో మద్దతు ఇచ్చిందని చెప్పుకున్నారు.నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేటలో మహాకూటమిగా అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్ పై పోటీ చేశాయి. నల్లగొండలో మహాకూటమి కాస్త వర్కవుట్ అయి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కానీ అచ్చంపేటలో చుక్కెదురైంది. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి:

ఈ నేపథ్యంలో వచ్చిన పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విపక్షాలు మరోసారి ఏకమయ్యాయి. అధికారికంగానే టీడీపీ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. జిల్లాలో తొలుత టీఆర్ఎస్ - టీడీపీ - కాంగ్రెస్ ల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా ఉండేది. సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్ఎస్ ఒకే ఒక స్థానంలో విజయం సాధిస్తే - వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో - ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారాయి. దాంతో పాలేరు నుంచి పోటీ చేయవద్దని టీడీపీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఒకే పోస్టర్ పై కాంగ్రెస్ - టీడీపీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ అగ్రనాయకుల ఫొటోలతో పోస్టర్ వేసేసారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ - కాంగ్రెస్ ను చీల్చి ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ - ఈ రెండు పార్టీలను వ్యతిరేకించే కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒకటిగా మారి ప్రచారం సాగిస్తున్నాయి. వామపక్షాలు మాత్రం ఒంటరిగా బరిలో దిగాయి. సీపీఐ మద్దతుతో సిపిఎం పోటీ చేస్తోంది. ఇక బిజెపి నేరుగా ఎవరికీ మద్దతు ఇవ్వకపోయినా, పోటీకి దూరంగానే ఉండడం ద్వారా టిఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. మొత్తంగా టీఆర్ఎస్ ఒకవైపు విపక్షాలన్నీ ఒకవైపు చేరి చేస్తున్న పోటీ రసవత్తరంగా మారింది..

ఇవి కూడా చదవండి:

English summary

TDO, Congress and Congress Parties were joined hands together in By Election Paleru in Khammam district.