స్పీకర్ పై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన వైసిపి

Ysrcp Disbelief Notice On A.p. Assembly Speaker

12:46 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Ysrcp Disbelief Notice On A.p. Assembly Speaker

స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావుపై వైసిపి అవిశ్వాసం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి వైసిపి ఎంఎల్ఎల్ లు బుధవారం ఉదయం నోటీసు అందజేసారు. అంతేకాదు ఈనెల 18వ తేదీన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా అందజేయాలని కోరారు.

డాక్టర్ కోడెల స్పీకర్ గా ఎన్నికవడానికి వైసిపి కూడా సహకరించిందని, అయినా స్పీకర్ తన పద్దతి మార్చుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసిపి ఎంఎల్ఎ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. అసలు అసెంబ్లీ వీడియోలు బయటకు ఎలా వచ్చాయని వైసిపి ఎంఎల్ఏలు ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేసారు.

కాగా గతంలో ఓ సారి స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైసిపి ఆతర్వాత వెనక్కు తీసుకుంది. మరి ఇప్పుడు వైసిపి ఎంఎల్ఎ రోజా పై ఏడాది పాటు సస్పెన్షన్ విధించడం, సస్పెన్షన్ ఎత్తివేయమని కోరినా ఫలితం లేకపోవడం , వైసిపి ఎం ఎల్ ఎ లంతా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడం తెల్సిందే. ఈనేపధ్యంలో ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

English summary

Ysr Congress party gives disbelief notice against Speaker Kodela Shiva Prasad to assembly official