సైకిల్ ఎక్కడానికి సై అంటున్న 'ఆది' 

Ysrcp MLA Adinarayana Reddy To Join IN TDP

06:45 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Ysrcp MLA Adinarayana Reddy To Join IN TDP

వైసిపి నేతలు ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. విశాఖ వైసిపి నేతలు కొణతాల రామకృష్ణ , గండి బాబ్జీ టిడిపిలో చేరడానికి సిద్ధమై , సిఎమ్ చంద్రబాబుని కల్సారు. సంక్రాంతి తర్వాత వీరి చేరిక ఉంటుందని తేలిపోయింది. ఇక ఎప్పటినుంచో ఊగిసలాడుతున్న కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి కూడా వైసిపి ని వీడి , టిడిపి గూటికి చేరబోతున్నట్లు వెల్లడైంది.

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తాను సిద్ధమేనని, పార్టీలో చేరే అంశంపై తెదేపా అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ఎం ఎల్ ఎ ఆదినారాయణరెడ్డి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేయడంతో, చేరిక లాంచానమే అని తేలింది.

తెలంగాణాలో టిఆర్ఎస్ ఆకర్ష్ పధకంలో టిడిపి - కాంగ్రెస్ నేతలు చేరిపోతుంటే , ఎపిలో కాంగ్రెస్ - వైసిపి నేతలు ఒకరి తర్వాత మరొకరు సైకులు ఎక్కడానికి సిద్ధమైపోతున్నారు. మొత్తానికి విపక్షాలను వీక్ చేయడమే తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాల ప్రధాన ఎజెండా గ కనిపిస్తోంది.

English summary

Ysrcp MLA Adinarayana Reddy from Vishakapatnam was ready to join in Telugu Desam Party