వైసిపిలో మరో వికెట్ పడింది

Ysrcp MLA Jayaramulu Joins In TDP

04:43 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Ysrcp MLA Jayaramulu Joins In TDP

ఇప్పటికే వైస్సార్ కాంగ్రెస్ కి చెందిన నలుగురు ఎంఎల్ఎ లు , ఓ ఎంఎల్సి తెలుగుదేశం పార్టీలో చేరిపోగా, ఇప్పుడు ఆ పార్టీకి మరో ఎదురు షాక్ తగిలింది. కడప జిల్లా బద్వేలు వైసిపి ఎంఎల్ఎ ఎమ్మెల్యే జయరాములు కూడా టిడిపి గూటికి చేరిపోయారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం జయరాములకు పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు బోండా ఉమా, యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్‌, జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ, చంద్రబాబు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఆకర్షితుడయ్యానని, తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని స్పష్టంచేశారు. బద్వేలు అభివృద్ధి కోసమే తెదేపాలో చేరినట్లు చెప్పారు.

English summary

Yesterday 4 Ysrcp MLA's and one MLC joined in TDP and today another MLA gave shock to Ysrcp party.Kadapa District Badvel MLA Jayaramulu joined in TDP.Jayaramulu Says that by seeing development works he joined in TDP.